ఇంగువ వంటకాలకు మంచి రుచిని ఇస్తుందని అందరూ అనుకుంటారు. అయితే ఇందులో ఔషధ గుణాలు ఎక్కువగా ఉండడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిది. ఆ ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
- ఇంగువను వంటల్లో తరచూ వాడడం వల్ల ఎసిడిటి, గ్యాస్ట్రిక్, పేగు పురుగులు, పేగు వ్యాధి మొదలైన అజీర్తి సమస్యలను తగ్గిస్తుంది. అరకప్పు నీటిలో చిన్న ఇంగువ ముక్కను కరిగించి తీసుకొంటే అజీర్తి నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది.
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కఫం, ఛాతి పైన ఒత్తిడి వంటి శ్వాస సంబంధ సమస్యలకు కూడా ఇంగువ చక్కటి పరిష్కారంగా పనిచేస్తుంది. తేనె, అల్లంతో కలిపిన ఇంగువను పొడి దగ్గు, కోరింత దగ్గు, శ్వాస నాళాల వాపు, ఉబ్బసం వంటి వ్యాధుల నుండి ఉపశమనం కోసం వాడతారు.
- ఇంగువ నీరు స్త్రీలలో రుతుక్రమ సందర్భంలో వచ్చే నొప్పి, బాధ, తిమ్మిరి వంటి సమస్యలకు శక్తివంతమైన మందుగా పనిచేస్తుంది.
- ఇంగువ డయాబెటిస్ వైద్యానికీ సహకరిస్తుంది. క్లోమ కణాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి తద్వారా మరింత ఇన్సులిన్ స్రావాన్ని ఉత్పత్తి చేయడానికి సహకరిస్తుంది.
- దీనిలోని కొమరిన్లు రక్తాన్ని పలుచగా చేసి, గడ్డకట్టడాన్ని నిరోధిస్తాయి. ఇంగువ రక్తాన్ని ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ నుండి రక్షిస్తుంది. రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.
- ఆహారంలో వాడే ఈ రుచికరమైన పదార్థం నరాలను ఉత్తేజితం చేస్తుంది. మూర్ఛ, వంకర్లు పోవటం, సొమ్మసిల్లుడం, ఇతర నాడీ సంబంధిత అనారోగ్యాలను అదుపులో ఉంచుతుంది.
- నీటిలో ఇంగువను కరిగించి తీసుకొంటే మైగ్రెయిన్, ఇతర తలనొప్పుల నుండీ ఉపశమనం కలుగుతుంది.
- అనేక చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో సమర్థవంతమైన చికిత్స కోసం ఔషధ లక్షణాలున్న ఇంగువను వాడతారు. దీనిని పుండ్లు, ఆనెలు ఉన్న చర్మంపై నేరుగా పూయవచ్చు. ఇంగువ కలిపిన నీటిని చర్మంపై పూస్తే గాయాలు, చర్మ సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.
- రాత్రి పడుకునేముందు పుప్పిపళ్లపై కాస్త ఇంగువ ఉంచితే క్రిములు నశిస్తాయి. నిమ్మరసంతో కలిపిన చిన్న ఇంగువ ముక్క పంటి నొప్పికి అద్భుతంగా పని చేస్తుంది.
- మలబద్ధకం ఉన్నవారు రాత్రి పడుకోబోయే ముందు ఇంగువ చూర్ణం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.