వర్షం కురిసింది!

Jun 11,2024 05:22 #feachers, #jeevana, #kavitalu

మేఘం ఉరిమింది
వర్షం కురిసింది
పుడమి నవ్వింది
ఆహ్లాదం పండింది

వాగు వంక నిండింది
చల్లదనం నింపింది
చెట్టుచేమ మురిసింది
పచ్చదనం పరిచింది

చల్లని గాలి వీచింది
హాయిదనం తెచ్చింది
వ్యవసాయం సాగింది
రైతు పంట పండింది

వాన జోరుగా కురిసింది
కొలనులో మీనం గెంతింది
చిన్నారి కేరింత కొట్టింది
హర్షం మదిలో నిండింది

నదులను నీళ్లతో నింపింది
విద్యుత్‌ కాంతులు వెదజల్లింది
ప్రకృతికి అందం తెచ్చింది
అందరికీ ఉపాధినిచ్చింది!

– మొర్రి గోపి,
88978 82202.

➡️