మామిడి పండ్లు

May 17,2024 03:15 #feachers, #jeevana, #Kavitha

వేసవి సెలవులు వచ్చాయి
పిల్లల ఆటలు పెరిగాయి
పిల్లల అల్లరి అల్లరితో
చిందర వందర చేశారు

బయట ఆడమని అమ్మ పంపించె
పక్క ఇంట్లో మామిడి కనిపించె
కాయలు పండ్లు నోరూరించే
ఎలా తినాలని ఆలోచించె

రవి రాయిని విసిరాడు
గురిచూసి మళ్ళీ విసిరాడు
మామిడి కింద పడింది
వెంటనె కీర్తి తీసింది

మూడు పండ్లు పోగేశారు
నాల్గో పండుకు ప్రయత్నించగా
రాయి ఆ ఇంట్లో పడింది
పిల్లలు పరుగున ఇల్లు చేరారు

పండ్లు ఎక్కడివని అడుగగా
ఇద్దరు గుటకలు మింగారు
చిలిపి పనులు చేశారని
అమ్మకు అర్థమైపోయింది

దొంగతనాలు చేయరాదని
ఇలా చేయడం మంచిది కాదని
నాన్న తెచ్చిన మామిడి పండ్లను
అమ్మ కడిగి పిల్లలకిచ్చింది!

– ఆవుల చక్రపాణి యాదవ్‌,
99633 50973.

➡️