మందు మొక్కలం
మేము మందు మొక్కలం
రోగాలను నయం చేసే
బంధుమొక్కలం!
ప్రతి ఇంటి పెరటిలో ఉండేటి
పెరటి మొక్కలం!
వేప మొక్కను నేను వేప మొక్కను
నోటి పుల్లగా వాడే నాటి మొక్కను
ఒంటి సబ్బులో వాడేటి చేదు మొక్కను!
ఉసిరి మొక్కను నేను ఉసిరి మొక్కను
పుల్లపుల్లగుండేటి ఉసిరి మొక్కను
విటమిన్ సి అందించే ఉసిరి మొక్కను!
తులసి మొక్కను నేను తులసి మొక్కను
పెరటిలోన ఉండేటి పూజ మొక్కను
రోగనిరోధకతను పెంచేటి మంచి మొక్కను!
బొప్ప మొక్కను నేను బొప్ప మొక్కను
విటమిన్ ఏ కలిగి ఉంటే గొప్ప మొక్కను
ప్లేట్లెట్స్‌ను పెంచేటి బొప్పాయి మొక్కను!
కరివేపను నేను కరివేపను
ప్రతి కూరలో వేసేటి కరివేపను
జీర్ణక్రియకు తోడ్పడే కరివేపాకును!
చాలా మొక్కలం
మేము చాలా మొక్కలం
మంచి మంచి ఔషధాలు నిండిన గనులం!
– ఏడుకొండలు కళ్లేపల్లి,
మచిలీపట్నం, 9490832338.