కోతి – అద్దం

Jan 8,2025 03:32 #feachers, #Kavitha, #monkey

కోతికి అద్దం దొరికింది
చేతిన చక్కగా పట్టింది!
ముఖం ముద్దుగా చూసింది
మురిసి మురిసి గెంతు లేచింది!

అద్దం గట్టిగా పట్టింది
చక చక చెట్టును ఎక్కింది!
మరలా ముఖమును చూసింది
ఆనందంగా కొమ్మన కూర్చుంది!

వాయిసమొకటి వాలింది
అద్దమున మోము చూసింది !
కావ్‌ కావ్‌ అని అరిసింది
కోతితో స్నేహం చేసింది!

అద్దం సంగతి తెలిసింది
రామచిలుక వచ్చింది!
అద్దంనెంతో మెచ్చింది
కోతిని బాగా పొగిడింది!

పావురం మురిసింది
కోకిలమ్మ నచ్చింది!
కోతికి ఆదరణ పెరిగింది
తానే గొప్పని మిడిసి పడింది!

ఒకరోజు అద్దం పట్టు జారింది
కిందపడి పగిలి ముక్కలయ్యింది!
కోతికి చాలా బాధ కలిగింది
పడి పడి మరీ ఏడ్చింది!

అద్దం కోసమె వచ్చే అందరూ
ఓదార్పుకు కూడా కరువయ్యారు
కోతికి సత్యం తెలిసొచ్చింది
మిడిసిపాటును విడిచి పెట్టింది!

– మొర్రి గోపి కవిటి, శ్రీకాకుళం జిల్లా,
88978 82202.

➡️