అనంతగిరి అడవిలో ఒక కోతి, కుందేలు ఉన్నాయి. అవి రెండూ మంచి స్నేహితులు. కోతి చెట్టు మీద, కుందేలు చెట్టు కింది బొరియలో నివసిస్తున్నాయి. ఒక రోజు అడవిలోకి వింత జంతువులు వచ్చాయని కోతికి తెలిసింది. అవి అడవిలోని జంతువులను తింటున్నాయని తెలిసి కుందేలు భయపడింది. తమను కాపాడమని అడవి రాజు సింహం దగ్గరికి వెళ్ళి వేడుకున్నాయి.
సింహం వింత జంతువుల దగ్గరికి వెళ్ళింది. అవి పది ఉన్నాయి. సింహం వాటితో చాలా సేపు పోరాడింది. తర్వాత సింహాన్ని అవి చంపేసాయి. ఇది చూసిన అడవిలోని జంతువులు చాలా భయపడ్డాయి. తమ ప్రాణాలు ‘ఎలా రక్షించుకోవాలో’ అని ఆలోచనల్లో పడ్డాయి. అప్పుడే కోతి తన ఆలోచనను వాటితో చెప్పింది. అది జంతువులకు బాగా నచ్చింది.
ఓ రెండు జింకలు వింత జంతువుల ఉండే దగ్గరికి వెళ్ళాయి. వాటిని చూడగానే ఆ జంతువులు జింకలను పట్టుకోవాలని వాటి వైపు పరుగెత్తాయి. కొంత దూరం పరుగెత్తిన తర్వాత జింకలు ఓ చోట ఆగాయి. వాటిని పట్టుకోవాలనన్న ఆతృతలో వింత జంతువులు అమాంతం వాటిపై దూకాయి. అంతే ఆ కిందనే అడవి జంతువులన్నీ పన్నిన వలలో అవి చిక్కుకున్నాయి. వెంటనే కోతి వాటికి నిప్పు పెట్టింది. వింత జంతువులు మంటలో మాడి చనిపోయాయి. అడవి జంతువులు అన్ని కోతిని మెచ్చుకున్నాయి.
– బి.విశ్వతేజ, 6వ తరగతి,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
అనంత సాగర్, సిద్దిపేట జిల్లా.