నా విహారయాత్ర

Dec 1,2024 02:55 #chinnari, #feachers, #Jeevana Stories

హాయ్ ఫ్రెండ్స్‌, ఇటీవల మా తరగతి పిల్లలందరినీ స్కూల్‌ యాజమాన్యం విహార యాత్రకు తీసుకువెళ్లారు. ఆ ప్రాంతం నాకు బాగా నచ్చింది. ముందుగా మేము జైనమందిరానికి వెళ్లి ప్రాంగణమంతా తిరిగి ఫొటోలు దిగాము. తర్వాత ఉప్పల పాడు పక్షుల కేంద్రానికి వెళ్లాం. అక్కడ ఎన్నో రకాల కొంగలను వాటి గూళ్ళను వాటి పిల్లల్ని కూడా చూసాము. అక్కడికి దగ్గర్లో ఉన్న ఖాళీ ప్రదేశంలో స్నేహితులందరం కలిసి భోజనం చేశాము. అక్కడే కొంతసేపు ఆటలాడు కున్నాము. అక్కడనుండి మంగళగిరి కొండపైకి స్కూల్‌ బస్సులో వెళ్ళాము. పై నుండి కిందకు చూస్తుంటే కింద ఇల్లు అన్నీ చిన్నవిగా కనిపించాయి. ఈ విహారయాత్ర ఎంతో సంతోషంగా, ఉల్లాసంగా గడిచింది. స్నేహితు లందరితో గడిపిన సమయం చాలా బాగుంది.

– బస్‌. లాస్య, 3వ తరగతి,
అరవింద హైస్కూలు, కుంచనపల్లి,గుంటూరు జిల్లా.

➡️