అమృత ఫలం

May 16,2024 04:13 #feature, #jeevana

సపోటా సపోటా
సుఫలమే సపోటా
మధురమే సపోటా
సుధలూరే సపోటా

అమృతమే సపోటా
ప్రకృతి వరమే సపోటా
కమ్మదనమే సపోటా
అమ్మ ప్రేమే సపోటా

తీపి తేనె సపోటా
ఊపిరూదె సపోటా
పుట్ట తేనె సపోటా
గట్టి తరువే సపోటా

ఆరోగ్య సిరి సపోటా
ఆలోచన ఝరి సపోటా
రక్త వృద్ధికి సపోటా
శక్తి దాయని సపోటా

– గుండాల నరేంద్రబాబు,
94932 35992.

➡️