కొత్తిమీర మజ్జిగలో పోషకాలు

Feb 19,2025 06:30 #butter milk, #feachers, #jeevanaa

వేసవికాలం వచ్చిందంటే దాహం తీర్చే చక్కని మజ్జిగను తాగుతుంటారు. ఈ మజ్జిగలో రోజుకోకటి చొప్పున కరివేపాకు, అల్లం, పచ్చి మిరపకాయ, కొత్తిమీర, పుదీన ఏదోకటి కలుపుకుని తాగితే రుచితో పాటు పోషకాలు అందుతాయి.

  • కొత్తిమీర మజ్జిగను తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. టైప్‌ 2 డయాబెటిస్‌ నుంచి బయట పడవచ్చు. డయాబెటిస్‌ నియంత్రణలో ఉంటుంది.
  • కొత్తిమీరలో ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. జీర్ణశక్తిని పెంచుతాయి. మెటబాలిజం పెరుగుతుంది. మలబద్దకం, కడుపు ఉబ్బరం తగ్గుతాయి. ఆకలి నియంత్రణలో ఉంటుంది. కొత్తిమీర జ్యూస్‌ తాగడం ఇష్టం లేనివారు మజ్జిగలో కలుపుకుని తాగొచ్చు. దీనివల్ల శరీరంలో ఉండే కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.
  •  కొత్తిమీర మజ్జిగలో విటమిన్లు, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. అవన్నీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీని వల్ల గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. హైబీపీ తగ్గుతుంది.
  •  పెరుగన్నం బదులుగా కొత్తిమీర మజ్జిగ అన్నం తింటే ఈ కాలంలో వచ్చే జీర్ణ సమస్యలు పోతాయి. లేదా కొంచెం ఉప్పు వేసి తాగడం వల్ల రక్త సరఫరా మెరుగు పడుతుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది.
➡️