నువ్వుల్లో పోషకాలు

Feb 15,2025 07:11 #Food Care, #health tips

నువ్వుల్లో ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్‌, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన పిండిపదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు, కార్బోహైడ్రేట్స్‌, ప్రోటీన్స్‌, ఫ్యాట్స్‌, ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌, యాంటీహిస్టమెన్స్‌ ఎక్కువగా ఉంటాయి. అందుకే రోజూవారి ఆహారంలో నువ్వులు భాగంగా చేర్చుకుంటే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.

  •  వీటిలో ఉన్న ఐరన్‌ జింక్‌, కాల్షియం వల్ల విటమిన్‌ ‘ఇ’ సమృద్ధిగా లభిస్తుంది. రక్తహీనతతో బాధపడే మహిళలు వీటిని తింటే నీరసం తగ్గుతుంది.
  •  మోకాళ్లు, శరీర నొప్పులతో నిత్యం బాధపడే వారు నువ్వులు, బెల్లం కలిపి ఉండలు చేసుకుని తింటే ఆరోగ్యం మెరుగుపడుతుంది.
  • వీటిలో పీచు పదార్థం అధికంగా ఉండడం వల్ల జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే ఫైటో స్టెరాల్స్‌ వల్ల శరీరంలో కొలెస్ట్రాల్‌ ఉత్పత్తి తగ్గుతుంది. దాంతో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా వుంటాయి.
  • నల్ల నువ్వుల్లో క్యాన్సర్‌ నివారించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి బ్రెయిన్‌లో ట్యూమర్‌ గ్రోత్‌ను నివారిస్తాయి.
  • వీటిల్లో 20 శాతం ప్రొటీన్లు, కాల్షియం ఉంటాయి. దెబ్బలు తగిలినప్పుడు త్వరగా మానటానికి సహకరిస్తాయి.
  • నువ్వుల నూనెలో ఉండే ప్రోటీన్లు శరీరంలో అధిక రక్తపీడనాన్ని అదుపు చేస్తాయి.
  • వీటిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో ప్లాస్మాలోని గ్లూకోజ్‌ స్థాయిలను పెంచుతుంది.
  • ఇన్ని ప్రయోజనాలు ఉన్న నువ్వుల నూనెను అప్పుడప్పుడు జుట్టుకి పట్టించి, శుభ్రం చేసుకుంటూ ఉంటే వెంట్రుకలు నల్లగా మారి ఆరోగ్యంగా పెరుగుతాయి.
➡️