మా బడి

Apr 15,2024 04:00 #jeevana

సరదా ఆటలు
పసందైన పాటలు
విజ్ఞాన యాత్రలు
మా బడి అంటే మాకిష్టం!

నీతి పద్యాలు
అభినయ గేయాలు
ఉత్సాహపు నృత్యాలు
మా బడి అంటే మాకిష్టం!

సైన్స్‌ ప్రయోగాలు
బమ్మల తయారీలు
సృజనాత్మక కృత్యాలు
మా బడి అంటే మాకిష్టం!

చక్కటి క్రమశిక్షణ
చదువులో మంచి శిక్షణ
గురువుల ఆదరణ
మా బడి అంటే మాకిష్టం!

– కయ్యూరు బాలసుబ్రమణ్యం,
77802 77240

➡️