చిట్టి చిట్టి చిలకలున్న
చెట్టుకు కాసెను పువ్వులంట
పువ్వులాయెను కాయలంట
కాయలేమో పండ్లాయనంట
పండ్లేమో మాకిష్టమంట
మేమే ఆ చిలకలమంట
పుష్టిగ మేమే తింటాం
ఆటలు హాయిగా ఆడుతాం
పాటలు బాగా పాడుతాం
చక్కగా బడికి పోతాం
చదువులు బాగా చదువుతాం
పరీక్షల భయం రానీయం
ఇష్టంగా చదువు నేర్చుకుంటాం
విజయాన్ని సాధిస్తాం
-యజ్ఞశ్రీ మాలేపాటి