ఎండు ద్రాక్ష ఎంతో మేలు

Apr 23,2024 05:48 #feachers, #jeevana, #Raisins

ఎండు ద్రాక్షలో పీచు పదార్థాలు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఏ, బీ, సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. రక్తహీనతతో బాధపడుతున్న వారు వీటిని తరచూ తింటే మంచిది.

  •  ఎండు ద్రాక్షలో కాపర్‌, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్‌, ఫాస్పరస్‌, మాంగనీస్‌ వంటి ఖనిజ లవణాల వల్ల నీరసం దరిచేరదు.
  •  బరువు తగ్గాలనుకునే వారు ఎండు ద్రాక్షను తీసుకుంటే ఫలితం కనిపిస్తుంది. జ్వరంతో బాధపడే వారు వీటిని తీసుకుంటే శక్తి వస్తుంది.
  •  చిన్నపిల్లల్లో జీర్ణశక్తి బాగా పెరిగేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది.
  •  ఇందులోని యాంటి ఆక్సిడెంట్లు బాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి.
  •  విటమిన్‌ బి ఆహారాన్ని విఛ్చిన్నం చేసి శరీరానికి పోషకాలు గ్రహించడంలో తోడ్పడుతుంది.
  •  కాపర్‌ మెలనిన్‌ ఉత్పత్తిలో కీలకం. కేశాలు నల్లగా మెరవాలంటే కాపర్‌ కలిగి ఉండే ఎండు ద్రాక్ష తినాల్సిందే.
  •  ఇందులోని ఐరన్‌ రక్తహీనతను తగ్గించడంతో మధుమేహాన్ని అదుపు చేస్తుంది. బీటా కెరోటిన్‌ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
  •  నానబెట్టిన కిస్‌మిస్‌లను తింటే బాడీ మెటబాలిజం సమతుల్యం అవుతుంది. జీవక్రియలు చురుగ్గా ఉంటాయి.
➡️