వేసవిలో అల్లరి

Jun 8,2024 04:30 #jeevana

అచ్చయ్య తోటలోకి
నెచ్చెలులతో వచ్చిరి
నచ్చిన కాయలు తినిరి!
ముచ్చట్లు చెప్పుకొనిరి
నచ్చినట్లుగా నడిచిరి
రెచ్చిపోయి పాడిరి
అచ్చమైన తెలుగు తిండ్లు ఆరగించిరి!

రచ్చలెరుగని అల్లర్లతో
ముచ్చటైన కబుర్లతో
వేసవిలో అల్లరి చేసిరి
అల్లరి పిల్లలు ఆడిపాడిరి!

– ఆళ్ల నాగేశ్వరరావు (కమల శ్రీ)
తెనాలి
74166 38823

➡️