సబ్జా నీళ్లు వేసవిలో మేలు

వేసవిలో డీ హైడ్రేషన్‌ గురికావడం వల్ల నీరసం వస్తుంది. త్వరగా అలిసిపోవడం, చికాకుగా అనిపిస్తుంది. ఇంకా అనేక చర్మ సమస్యలు, జుట్టు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఈ సమస్యలన్నింటికీ సబ్జా గింజలు చక్కని పరిష్కారం చూపుతాయి. వీటిలో చాలా రకాల ప్రోటీన్స్‌ ఉన్నాయి.

  • సబ్జా గింజల్లో ఆల్ఫా-లినోలెనిక్‌ యాసిడ్‌ పుష్కలంగా ఉంటుంది. ఫైబర్‌ వల్ల కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది.
  •  సబ్జా గింజలను నిమ్మకాయ నీరు, షర్బత్‌, మిల్క్‌షేక్‌ల వంటి రిఫ్రెష్‌ డ్రింక్స్‌లలో వేసుకుని రోజుకు మూడు, నాలుగు గ్లాసులు తీసుకుంటే వడదెబ్బ నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు.
  •  సబ్జా గింజల్లో పీచు ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయట పడొచ్చు. శరీరంలో ఉన్న వ్యర్థాలు కూడా బయటికి వెళ్లిపోతాయి. రక్తం శుద్ధి అవుతుంది. జీర్ణ సంబంధ సమస్యలైన కడుపు మంట, ఉబ్బరం, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు తొలగిపోతాయి.
  •  సబ్జా గింజలను నూరి కొబ్బరి నూనెలో వేసి, ప్రభావిత ప్రాంతాలపై రాయడం వల్ల తామర, సోరియాసిస్‌ వంటి అనేక చర్మ వ్యాధుల చికిత్సకు సహాయ పడుతుంది.
  •  సబ్జా గింజలను నానబెట్టకుండా, నూరి ఒక కప్పు కొబ్బరి నూనెలో వేసి, కొన్ని నిమిషాలు పాటు వేడి చేసి అప్లై చేయాలి. చర్మం దెబ్బతిన్న చోట, కొత్త చర్మ కణాలను ఏర్పరుస్తుంది.
  •  సబ్జా గింజల్లో ఐరన్‌, విటమిన్‌ కె, ప్రోటీన్‌ ఉన్నాయి. ఇవి జుట్టుని బలంగా చేయడంలో తోడ్పడతాయి.
  •  చక్కెర వేయకుండా సబ్జా గింజల నీటిని తాగితే మధుమేహం అదుపులోకి వస్తుంది. రక్తంలోని గ్లూకోజ్‌ స్థాయిలు తగ్గుతాయి.
  •  నానబెట్టిన సబ్జా గింజలను గ్లాసు పచ్చిపాలలో వేసుకొని, కొన్ని చుక్కల వెనిలా కలిపి తాగితే టైప్‌2 మధుమేహంతో బాధపడే వారికి ఉపశమనం కలుగుతుంది.
  •  సబ్జా గింజలలో యాంటిస్పాస్మోడిక్‌ ఉంటుంది. అంటే ఇవి స్పాస్మాటిక్‌ కండరాలలో ఉద్రిక్తతను తగ్గించి దగ్గును నియంత్రించడంలో సాయపడుతుంది. ఇవి రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి.
  •  సబ్జా గింజల్లో ఉండే వైసెనిన్‌, ఓరింటిన్‌, బీటా కెరోటిన్‌ వంటి ఫ్లేవనాయిడ్స్‌ శరీర రక్షణ వ్యవస్థను బలపరుస్తాయి. కేవలం శరీరం లోపలి భాగాన్నే కాక బయట భాగాన్ని కూడా కాపాడటంలో ఇవి బాగా పనిచేస్తాయి.
  •  తలనొప్పి, మైగ్రేన్‌ లాంటి సమస్యలు ఉన్నవారు ఈ గింజల్ని నీళ్లలో కలుపుకొని తరుచూ తాగితే ఉపశమనం కలుగుతుంది.
➡️