హేమంత రుతువు వచ్చింది
సంక్రాంతి సందడి తెచ్చింది
పల్లెకు వెలుగు వచ్చింది
ఇంటింటా సందడి తెచ్చింది
మగువలు వేసే ముత్యాల ముగ్గులు
అందం వచ్చెను పల్లె లోగిళ్ళు
విరబూసిన చామంతులు
ఇంతులు… పూబంతులు
బుడబుక్కల వారి చప్పుళ్ళు
గంగిరెద్దుల ఆటపాటలు
హరిదాసు కీర్తనలు
పగటి వేషగాళ్ల సందడులు
పిట్టలదొర చమత్కారాలు
గాలిపటాల కేరింతలు
భోగిమంటల భోగభాగ్యాలు
పిండి వంటల సువాసనలు
అమ్మలక్కల ఆప్యాయతలు
రైతుల ఇంట పాడిపంటలు
పండగంటే సరదాలు
కోడిపందాలు సంగిడి ఆటలు
బంధువులతో విందు భోజనాలు
కొత్త అల్లుళ్ల పరవశాలు
భోగి సంక్రాంతి కనుమ
తెలుగింటి శోభల మహిమ
– మొర్రి గోపి, కవిటి,శ్రీకాకుళం జిల్లా,
88978 82202