సంక్రాంతి!

Jan 11,2025 03:34 #feachers, #Kavitha

సంక్రాంతి పండగ వచ్చింది
సెలవులు మెండుగా తెచ్చింది
పంట దిగుబడి ఇంటికి చేరు
రైతు ముఖాల్లో కాంతులు చూడు

కొత్త అల్లుళ్ల సందడులు
కొంటె మరదళ్ళ అల్లర్లు

చల్లదనం చుట్టూ ముట్టింది
భోగి మంటలేద్దాం రారండి

గంగిరెద్దుల విన్యాసం
రంగవల్లుల వైభోగం

కొత్త బట్టల ఆనందం
పిల్లలందరికి ఆహ్లాదం

పిండి వంటల ఘుమ ఘుమలు
కోడి పందేల సందడులు

గాలిపటాలను ఎగరేద్దాం
ఆకాశంలో హాయిగా విహరిద్దాం!

– ఏడుకొండలు కళ్ళేపల్లి, మచిలీపట్నం,
94908 32338.

➡️