సంక్రాంతి పండుగ ఇది
సరదాలకు వేదిక ఇది
ఇంటింటా సంబరాలు
ఆనందపు నిలయాలు
ఆడపడుచుల రాకలు
బంధువుల సందళ్ళు
గారెలు బూరెలు అరిసెలు
నోరూరించే వంటలు
గుమ్మాలకు తోరణాలు
బంతిపూల మాలలు
పండుగ ఆడంబరాల
అందమైన లోగిళ్ళు
ధాన్యపు రాశుల సందడి
రైతులింట హడావుడి
ముస్తాబయ్యే పశువులు
మురిపించే తిరునాళ్ళు
వాకిళ్ళలొ విరబూసే
రంగు రంగుల ముగ్గులు
మనసులు మైమరిపించే
గొబ్బెమ్మలు బంతులు
హరిదాసుల కీర్తనలు
అలరించే పాటలు
గంగిరెద్దుల ఆటలు
ఘనమైన వేడుకలు
ఆకశాన అద్భుతాలు
గాలిపటాల రెపరెపలు
అద్భుత విన్యాసాలు
అలరించే సోయగాలు
పల్లె ప్రజలు ఇష్టపడే
కోడిపుంజు పందాలు
ఊరూరా సంబరాలు
ముద్దొచ్చే జాతరలు
జనజీవన గమనంలో
ఏడాదికి ఓ సంక్రాంతి
అనుదినం పొందాలి
నిత్య నూతన క్రాంతి
– నాగరాజు కామర్సు
92480 93580.