చిట్టి అద్దం
ముందు చేరింది!
అద్దం చిట్టి
ముందు చేరింది!!
చిట్టి అద్దాన్ని చూసి
బుంగమూతి
పెట్టింది
అద్దం చిట్టిని చూసి
బుంగమూతి
పెట్టింది!!
చిట్టి అద్దాన్ని చూసి
చిన్నగ నవ్వింది!
అద్దం చిట్టిని చూసి
చిన్నగ నవ్వింది!!
చిట్టి అద్దాన్ని చూసి
ఎక్కిరిచ్చింది!
అద్దం చిట్టిని చూసి
ఎక్కిరిచ్చింది!!
చిట్టి
అద్దాన్ని చూసి
పిడికిలి
బిగించింది!
అద్దం చిట్టిని చూసి
పిడికిలి
బిగించింది.
చిట్టి అద్దంతో
చేయి కలిపింది!
అద్దం చిట్టితో
చేయి కలిపింది!!
– అమ్మిన వెంకట అమ్మిరాజు,
94407 08656.