ఎండలు మండుతున్న వేళ కూల్‌డ్రింక్స్‌కి బదులు చెరకు రసం తాగితే ఎంతో మేలు.
- చెరకు రసం అలసట, నిస్సత్తువను తగ్గించి తక్షణ శక్తిని అందిస్తుంది.
- చెరకులో పిండిపదార్థాలు, ఫైబర్, పొటాషియం, జింక్, ఫాస్ఫరస్, క్యాల్షియం, ఐరన్ లాంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్-ఎ, బి, సి కూడా మెండుగా ఉంటాయి. దీంతో చెరుకు రసం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో ప్రొటీన్ స్థాయిలు పెరుగుతాయి. – మూత్రపిండాల ఆరోగ్యానికి కూడా మంచిది.
- అలాగే క్రమం తప్పకుండా చెరకు రసం తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
- ఇందులోని ఫ్లేవనాయిడ్స్, యాంటీఆక్సిడెంట్లు, ఇతర ఫెనోలిక్ కాంపౌడ్స్ వృద్ధాప్య ఛాయలు రాకుండా అడ్డుకుంటాయి.
- చెరకు రసం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
ఎక్కువ వద్దు
- అయితే కొంతమంది చెరకురసం ఆరోగ్యానికి మేలు చేస్తుందని.. ఎక్కువగా తాగుతారు. ఒకేసారి రెండు గ్లాసుల కంటే ఎక్కువ చెరకు రసం తాగితే.. ఆరోగ్యానికి హాని జరిగే ప్రమాదం ఉంది.
- చెరకు రసం అధికంగా తీసుకోవడం వల్ల విరేచనాలు, మలబద్ధకం, డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది.
- అలాగే 20 నిమిషాల కంటే ఎక్కువసేపు నిల్వ ఉంచింది తాగకూడదు. ఒకవేళ తాగితే శరీరానికి మంచిది కాదు.
- నిల్వ ఉన్న చెరుకురసం ఆక్సీకరణ చెంది, కడుపు నొప్పి, వాంతులు, కళ్లు తిరగడం వంటి సమస్యలకు కారణమవుతుంది. కాబట్టి తాజాగా చేసిన చెరకు రసం తాగడం మంచిది.
- చెరకు రసంలో పొలికోసనాల్ అధికంగా ఉంటాయి. పొలికోసనాల్ అధికంగా ఉండటం వల్ల నిద్రలేమి సమస్య వచ్చే అవకాశం ఉంది. ఈ సమస్య ముదిరితే.. మానసిక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
- చెరకు రసంలో కేలరీలు, చక్కెర పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎక్కువగా తీసుకుంటే బరువు త్వరగా పెరుగుతారు.
- బరువును అదుపులో ఉంచుకోవాలంటే.. రోజుకు ఒక గ్లాసు చెరకు రసం మాత్రమే తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
- చెరకులో ఉండే పోలికోసనాల్ రక్తాన్ని పలుచగా చేస్తాయి. దీని వల్ల రక్తం గడ్డకట్టదు.