వేసవి సెలవులు

Apr 24,2024 04:44 #jeevana

వేసవిలో వచ్చు సెలవులు
పిల్లలకు ఆట విడుపులు
మనో ఉల్లాస వేదికలు
ప్రతిభకు ప్రోత్సాహకాలు!

వచ్చిన సెలవులను
సద్వినియోగం చేసుకోవాలి
చదువుతో పాటు
ఆటపాటలనూ నేర్చుకోవాలి!

నలుబది అయిదు రోజుల సెలవులు
నూతనోత్సాహపు పునాదులు
సెలవుల్లో చేయు విహారయాత్రలు
విద్యార్థులకు అందించును విజ్ఞాన వినోదాలు!

సెలవుల్లో బంధువుల ఇండ్లకు వెళ్లడం సహజం
బంధువుల పిల్లలతో సక్రమంగా మెలగడం
కలసి మెలసి కలివిడిగా మసలడం
పరాయి ఇండ్లకు వెళ్ళినప్పుడు పిల్లల కర్తవ్యం!

బంధువుల పిల్లలు మనింటికి వచ్చినప్పుడు
వారితో కలిసిమెలసి ఆడుకోవాలి
గిల్లి కజ్జాలు పెట్టుకోకుండా
మన సోదర సమానుల్లా ఆదరించాలి!

– ఆళ్ల నాగేశ్వరరావు (కమల శ్రీ),
74166 38823.

➡️