చెరువును నేను
పల్లె చెరువును నేను
పల్లెలతో అల్లుకున్న బంధం నేను
పల్లె ప్రజల జీవన
రథ సారధి నేను
జన జీవన చైతన్యపు
వారధి నేను
ప్రజలందరి అవసరాలు
తీర్చేస్తాను
పాడి పశువులకు
తాగు నీరిస్తాను
పక్షులనెంతో ప్రేమతో
లాలిస్తాను
పంట పొలాలకు
నీటిని అందిస్తాను
రైతుకు చేయూతనిచ్చి
ఆదుకుంటాను
చేపల ఉత్పత్తి కొరకు
తోడ్పడుతాను
భూగర్భ జలాలను
చక్కగ పెంచేస్తాను
బోరు బావులను
నిండుగ నింపేస్తాను
ప్రకృతిలో దృశ్యమునై
పరవశింపజేస్తాను
పల్లెటూరి సంస్క ృతి ప్రతిబింబం నేను
చెరువును నేను
పల్లె చెరువును నేను…
– నాగరాజు కామర్సు,
92480 93580.