తొలకరి చినుకులు

Jun 9,2024 05:08 #feachers, #jeevana, #kavithalu

తొలకరి వాన కురిసింది
భూమి తాపం చల్లార్చింది
చల్లదనాన్ని ఇచ్చింది
ఎండ వేడిమి తగ్గించింది

పచ్చిక పచ్చగా మెరిసింది
చిగురు తొడిగి వెలిగింది
చిట్టి మొక్క మొలిచింది
చిన్న చిన్నగా పెరిగింది

చిటపట చినుకు పడింది
నాగలి పొలాన్ని దున్నింది
విత్తనాలను చల్లింది
పంటకు ప్రాణం పోసింది

పిల్ల కాలువ పారింది
చెరువు తొణికిసలాడింది
చేపకు ఉత్సాహమేసింది
ఎగిరి ఎగిరి దుమికింది

వాన మేఘం కదిలింది
జడి వాన బాగా కురిసింది
మిల మిల మెరుపు వచ్చింది
ఫెళ ఫెళ ఉరుము ఉరిమింది

ప్రకృతి పులకరించింది
పక్షుల గుంపు వాలింది
అడవి కళకళలాడింది
కొండా కోనా మురిసింది

రెతు కళ్ళలో ఆనందం
మల్లె మొగ్గై విచ్చుకుంది
నేల అదునుకై ఆనందంగా
చిందులేస్తూ కదిలింది!

– నరెద్దుల రాజారెడ్డి,
96660 16636.

➡️