బండి బండి రైలు బండి
రమ్యమైన రైలు బండి
చూడసక్కనైన బండి
చుక్ చుక్ చుక్ రైలు బండి
పాములాగా పరుగుతీస్తు
పట్టాలెక్కి తిరుగునండి
రంగు రంగు బోగీలతో
రమణీయ రూపమండి
అలుపించక సొలపించక
హాయినిచ్చు పయనమండి
దూరం ఎంతైన గాని
పదిలంగా చేర్చునండి
చెట్లూ చేమలు అడవులు
కొండలు కోనలు నదులు
అలవోకగ దాటుకుంటు
ఆహ్లాదం పంచునండి
భోజన ఫలహారాలు
శీతల పానీయాలు పండ్లు
బిస్కెట్టులు చాక్లెట్టులు
సకలం సమకూర్చునండి
పిల్లల ఆటలు పాటల
పెద్దల మాటల మూటల
ఆటవిడుపు పయనమండి
రైలులోనే సాధ్యమండి
రాత్రైనా పగలైనా
ఎండ వాన చలియైనా
గమ్యానికి చేర్చునండి
అదియే మన రైలు బండి
ప్రకృతి దృశ్యాలనెన్నో
పలకరిస్తూ పరుగులిడుతు
పయనం సాగించునండి
అలరించే శకటమండి
– నాగరాజు కామర్సు,
92480 93580.