వాలెంటైన్స్‌ డే.. ఒక్కో రోజుకి ఒక్కో స్పెషల్‌

Feb 14,2024 11:31 #valentine's day

ఇంటర్నెట్‌డెస్క్‌ : వాలెంటైన్స్‌ డే (ఫిబ్రవరి 14వ తేదీ ప్రేమికుల దినోత్సవం) ఈరోజు ప్రేమికులకు గుర్తుండిపోయే రోజు. ఆరోజున ప్రేమికులు ఒకరినొకరు తమ ప్రేమను వ్యక్తపరచడం, వారి ప్రేమకు గుర్తుగా బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ప్రేమకు చిహ్నంగా జరుపుకునే ఈరోజునే ప్రేమను, ప్రేమ వివాహాలను ప్రోత్సహించిన వాలెంటైన్‌ అనే ప్రవక్తను రోమన్‌ చక్రవర్తి క్లాడియస్‌ అతన్ని ఊరితీయించాడు. వాలెంటైన్‌ చనిపోయిన రోజునే ఈ ప్రేమికుల దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. అయితే ప్రేమికుల దినోత్సవం వారం ముందు నుంచే హడావిడి మొదలవుతుంది. ఫిబ్రవరి 7న రోజ్‌ డే, ఫిబ్రవరి 8న ప్రపోజ్‌ డే, ఫిబ్రవరి 9న చాక్లెట్‌ డే, ఫిబ్రవరి 10న టెడ్డీ డే, ఫిబ్రవరి 11న ప్రామిస్‌ డే, ఫిబ్రవరి 12న హగ్‌ డే, ఫిబ్రవరి 13న కిస్‌ డే, ఫిబ్రవరి 14 వాలెంటైన్స్‌ డే. ఇలా మొత్తం వారం రోజులకు ఒక్కోరోజుకి ఒక్కో స్పెషల్‌ ఉంది.

రోజ్‌ డే..

ప్రేమకు గుర్తుగా చూపించేవి గులాబీలనే. విక్టోరియన్లు తమ ప్రేమకు చిహ్నంగా గులాబీలను ఇచ్చేవారట. ఆరోజునే రోజ్‌ డేగా పేరుగాంచింది.

ప్రపోజ్‌ డే

ప్రేమికులు తన ప్రేమను వ్యక్తపరిచే రోజునే ప్రపోజ్‌ డే. ఈరోజున తన ప్రేమను వ్యక్తపరచడమే కాదు.. జీవితాంతం తనకు తోడుగా ఉండాలని కోరుకోవడమే ఈరోజు ప్రత్యేకత.

చాక్లెట్‌ డే

ఈరోజున అమితంగా ప్రేమిస్తున్న వారికి చాక్లెట్స్‌ బహుమతిగా ఇస్తారు. ప్రేమ, ఆరాధనా భావానికి, ఆనందానికి ఇవి చిహ్నంగా ఉంటాయి. అందుకే ఈరోజున చాక్లెట్స్‌ బాక్సును తనను ప్రేమించేవారికి గిఫ్ట్‌గా ఇస్తారు.

టెడ్డీ డే

టెడ్డీబేర్‌ని ఇష్టపడనివారెవరుంటారు. ఎవరైనా సరే టెడ్డీ బేర్‌ని చూడగానే మనసు పులకించిపోతుంది. అందుకే తనిని ఎంతో ప్రేమించే వారికి టెడ్డీ బేర్‌ని గిఫ్ట్‌గా ఇస్తారు. ఈ గిఫ్ట్‌ చాలాకాలం వరకూ గుర్తుండిపోతుంది. ఆ మధురక్షణాల్ని జ్ఞప్తికి తెస్తుంది.

ప్రామిస్‌ డే

ప్రేమికులు తమ ప్రేమను నిలుపుకునేందుకు.. జీవితాంతం ఆ ప్రేమని కాపాడుకునేందుకు ఒకరికొకరు వాగ్దానం చేసుకుంటారు. ఆ వాగ్దానానికి కట్టుబడి ఉండేందుకు ఇరువురూ జీవితాంతం శ్రద్ధ వహించాలి. ఎంతో బాధ్యతతో మెలగాలి. జీవిత ప్రయాణంలో ఎన్ని ఒడిదుడుకులొచ్చినా.. ఇద్దరు ఎదుర్కొని ముందుకు సాగాలనే లక్ష్యంతోనే వాగ్దానం చేసుకుంటారు. బహుమతులు కొన్నిరోజులకి మాయమైపోవచ్చు. కానీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం అంటే మాములు విషయం కాదు. అందుకే ఈ డేకి ఎంతో స్పెషల్‌.

హగ్‌ డే

భావాలను మాటలతో చెప్పలేనప్పుడు స్పర్శతో వాటిని వ్యక్తపరచవచ్చు. చాలా సందర్భాలలో భావాలను వ్యక్తపరచడానికి మాటలు రావు. అది బాధైనా, సంతోషమైనా ఏదైనా సరే. ఆ సమయంలో హగ్‌ చేసుకుంటే.. వారికి ఇట్టే తెలిసిపోతుంది. బాధలో ఉన్నప్పుడు హగ్‌ చేసుకుంటే.. ఎదుటివారు ఓదార్పునిస్తారు. సంతోషంలో అయితే ఆ హ్యాపీనెస్‌ని వాళ్లు షేర్‌ చేసుకుంటారు. కౌగిలించుకోవడం వల్ల ఆక్సిటోసిన్‌ విడుదల అవుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఆందోళనను, నిరాశను తగ్గిస్తుంది. ఒకరి ప్రేమ మరొకరికి వారి భావోద్వేగాలను అర్థం చేసుకునేందుకు ఇదొక చక్కటి మార్గం.

కిస్‌ డే

ముద్దు ప్రేమికుల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుతుంది. ప్రేమికులు తాము ప్రేమలో ఉన్నామని బయటకు చెప్పడానికే.. నలుగురికి తెలియజేయడానికే కిస్‌ చేసుకుంటారు. కిస్‌ ప్రేమ యొక్క నిబద్ధతను తెలియజేస్తుంది.

చివరగా ఫిబ్రవరి 14 వాలంటైన్స్‌ డే జరుపుకుంటారు. వారం రోజుల్లో ఒక్కో రోజుకి ఒక్కో స్పెషల్‌. ఈ వారం రోజుల మధురానుభూతుల సమ్మేళనమే వాలంటైన్స్‌ డే.

➡️