సాధారణంగా ఎండాకాలంలో ఇల్లు చల్లదనం కోసం వట్టి వేళ్లతో చేసిన చాపలు వాడుతుంటారు. కొబ్బరి నూనెలో వేసుకుని కూడా కొంతమంది ఉపయోగిస్తుంటారు. వీటిని ఆహారంలో కూడా భాగం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. ఈ వేర్లలో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఎక్కువగా ఔషధాల్లో వాడతారని వైద్యులు చెబుతున్నారు.
- వట్టివేరుతో షర్బత్ తయారుచేసుకుని తాగడం వల్ల ఎండాకాలం తరచూ వచ్చే కడుపు నొప్పి, మలబద్ధకం, తలనొప్పి తగ్గుతాయి.
- నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. మెదడుకి రక్త ప్రసరణ సాఫీగా సాగుతుంది.
- వట్టివేరు సారం శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. సువాసన భరితంగా ఉండడం వల్ల ఒత్తిడి కూడా దూరమవుతుంది.
- నిద్రలేమిని పోగొట్టి జీర్ణ సమస్యలని దూరం చేస్తుంది..
- తలనొప్పితో బాధపడుతుంటే ఈ వేర్లని నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగొచ్చు. వేర్లని మెత్తని పేస్టులా నూరి దానిని తలపై పట్టిలా వేసుకుని కాసేపయ్యాక శుభ్రం చేసుకున్నా తలనొప్పి తగ్గిపోతుంది.
- వేర్లని ఓ గ్లాసులో వేసి ఓ నాలుగైదు గంటలు లేదా రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తాగాలి. దీని వల్ల డీహైడ్రేషన్ సమస్య దూరమవుతుంది.
- కుండనీళ్లు వాడేవారు ఈ వట్టివేరుని ఓ తెల్లని వస్త్రంలో మూట కట్టి ఆ నీటిలో వేయాలి. రెండు, మూడ్రోజులకి ఓసారి వట్టివేరును మార్చుకోవాలి.
- కుండ నీటిలో నానబెట్టిన వట్టివేర్లని పారేయకుండా దానిని మెత్తగా నూరుకొని ప్యాక్‌లా ముఖానికి వేసుకోవచ్చు. దీంతో ముఖంపై ఉన్న మచ్చలు, మొటిమలు దూరమవుతాయి.
- వట్టివేర్లని నీటిలో వేసి మరిగించి స్నానానికి వాడే నీటిలో కలిపి స్నానం చేస్తే చెమట వాసన దూరమవుతుంది.