వెచ్చదనాన్నిచ్చే దుప్పట్లు…

చలికాలం.. అందులోనూ రోజురోజుకూ ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. చలి వాతావరణం నానాటికీ పెరిగిపోతోంది. ఈ క్రమంలో శరీరానికి వెచ్చదనాన్నిచ్చే దుస్తులపైన అందరూ దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఎక్కడ చూసినా చలిదుస్తులకు బాగా గిరాకీ కనిపిస్తోంది. బయటకు వెళ్తే శరీరానికి రక్షణ నిచ్చే స్వెట్టర్లు నుంచి తలకు టోపీ, మొప్లర్‌, మంకీక్యాప్‌, చెవులకు గాలి తగులకుండా ఇయర్‌ మఫ్స్‌తో ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలి. అంతేకాకుండా పడుకునేందుకు మంచి దుప్పట్లు కూడా వినియోగిస్తే చలి నుంచి వెచ్చదనాన్ని అందిస్తూ మంచి నిద్రను పొందగలం. అందుకే చలినుంచి కాపాడేందుకు ఈ కాలంలో దుస్తుల ఎంపిక ఎంతో ముఖ్యం. ఇప్పుడు మార్కెట్లో అనేక రకాలైన దుప్పట్లు ఇబ్బడిముబ్బడిగా వచ్చేశాయి.

శీతాకాలంలో వెచ్చని దుప్పటి కలిగివుండటం ఎంతో అవసరం. మంచి నాణ్యత కలిగిన దుప్పటి మన శరీరాన్ని చలి నుంచి కాపాడి వెచ్చగా మారుతుంది. మృదువైన, సౌకర్యవంతమైన దుప్పట్లు ప్రస్తుతం మార్కెట్లో విరివిగా అందుబాటులో ఉన్నాయి. ప్రయాణాల్లో కూడా మన వెంట వీటిని తీసుకెళ్లొచ్చు. డబుల్‌బెడ్‌, సింగిల్‌బెడ్‌లకు ఉపయోగించే దుప్పట్లు నేడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. తేలికపాటి దుప్పట్ల నుంచి బరువు ఉన్నవి కూడా రగ్గుల వరకూ ఈ కాలంలో చలి నుంచి కాపాడటానికి దోహదపడతాయి. బాగా చలిగా ఉన్నప్పుడు రెండు దుప్పట్లు కప్పుకోగానే క్షణాల్లో వెచ్చగా ఉంటుంది. మనం రెండు దళసరి దుప్పట్లు కప్పుకున్నప్పుడు వాటి మధ్య ఒక గాలి పొర ఇరుక్కుపోతుంది. ఇలాంటి గాలిపొర వేడిని తన గుండా అంత సులభవంగా పోనివ్వదు. దాంతో మన ఒంట్లో వేడి అంత సులభంగా గాల్లోకి పోదు. అందువల్లే రెండు దుప్పట్లను కప్పుకున్నప్పుడు మనకు వెచ్చగా ఉంటుంది. మార్కెట్లో వివిధ కంపెనీలకు చెందిన దుప్పట్లు అందుబాటు ధరల్లో ఆకర్షణీయంగా ఉంటున్నాయి. చలి నుంచి రక్షణ పొందేందుకు మార్కెట్లో లభిస్తున్న కొన్ని దుప్పట్ల గురించి తెలుసుకుందాం.

ఎలక్ట్రిక్‌ బ్లాంకెట్స్‌ : అనేక రకాలైనవి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. స్టైలిష్‌గా కూడా వీటిని తయారుచేశారు. కరెంట్‌ ఛార్జింగ్‌తోపాటుగా మాన్యువల్‌గా కూడా హీట్‌ కంట్రోల్‌తో ఇది అందుబాటులో ఉన్నాయి. నాణ్యమైన ఎలక్ట్రిక్‌ బ్లాంకెట్లను మాత్రమే ఎంచుకోవాలనీ, లేనిపక్షంలో షార్ట్‌ సర్క్యూట్‌తోపాటు హీట్‌ ఎక్కువైతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సాఫ్ట్‌, బెస్ట్‌ బ్యాంకెట్స్‌ : తేలికపాటి దుప్పట్లు సైతం కొన్ని ఈ సీజన్‌లో చలిని ఆపగలిగేవి ఉంటాయి. సాఫ్ట్‌ బ్యాంకెట్స్‌గా కూడా వీటిని పిలుస్తుంటారు. చాలా తక్కువ ధరల్లోనూ దొరుకుతుంటాయి. చాలా అందంగా ఉంటాయి. వెచ్చని అనుభూతిని అందిస్తాయి. ఎక్కువమంది మృదువైన, తేలికపాటి దుప్పట్లనే ఇష్టపడుతున్నారు. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయాలనుకునే వారు ఈ దుప్పట్లను తీసుకెళ్తే చలినుంచి రక్షణకు దోహదపడతాయి.

పోరల్‌ ప్లీ సింగిల్‌ బెడ్‌ బ్యాంకెట్‌ : ఇది నాలుగు రంగుల సింగిల్‌ బెడ్‌ బ్యాంకెట్‌లతో కూడి గొప్ప కాంబో ప్యాక్‌. నాలుగు విభిన్న రంగులను కలిగివుంటుంది. స్వచ్ఛమైన ఉన్ని బట్టతో తయారుచేయబడింది. సింగిల్‌ బెడ్‌ బ్యాంకెట్‌ : ఇవి చాలా మృదువుగా ఉంటాయి. ఒక్కో దుప్పటి 400 గ్రాముల వరకూ ఉంటుంది. ఇళ్లల్లో చిన్న పిల్లలు ఉన్న వారికి సింగిల్‌ బెడ్‌ బ్యాంకెట్‌ ఉపయోగకరంగా ఉంటుంది.

సింగిల్‌ బెడ్‌ పోరల్‌ ప్లీ ఎసి బ్యాంకెట్‌ : ఇది పోరార్‌ ప్లీస్‌ సింగిల్‌ బెడ్‌ బ్లాంకెట్‌. ఎసి గదికి చాలా బాగుంటుంది. శీతాకాలంలో టీవీ చూసేటప్పుడు కూడా ఈ దుప్పటిని వినియోగించొచ్చు. ఇది చూడటానికి చాలా అందంగా ఉంటుంది.

లైట్‌ వెయిట్‌ సూపర్‌ సాఫ్ట్‌ లగ్జరీ త్రో బ్లాంకెట్‌ ఫర్‌ ది బెడ్‌ : ఇది తేలికైన, చాలా వెచ్చని అనుభూతిని అందించే దుప్పటి. బ్యాంకెట్‌ ఫర్‌ బెడ్‌ ఫాబ్రిక్‌ పాలిస్టర్‌. ఇది చాలా మృధువైనది. ఇది ఎసి గదికి, సోఫాలో కూర్చుని టివి చూస్తున్నప్పుడు ఉపయోగించటానికి చాలా బాగుంటుంది. ఈ తేలికపాటి దుప్పటి పరిమాణం 90 అంగుళాల పొడవు, 78 అంగుళాల వెడల్పు ఉంటుంది. బ్యాంకెట్‌ ఫర్‌ బెడ్‌ ఒక వ్యక్తికి సరిపోతుంది.

సింగిల్‌ బెడ్‌ సైజ్‌ పోరల్‌ ప్లీ ఉలెన్‌ బ్యాంకెట్‌ : ఇది ప్రీమియం క్వాలిటీ బ్లాంకెట్‌. దీనిని సిల్కీ, మృధువైన హెవీ డ్యూటీ ఫ్రాబ్రిక్‌ వెచ్చగా ఉంచుతుంది. మంచి నిద్రను అందిస్తుంది. ఉలెన్‌ బ్లాంకెట్‌ పొడవు 88 అంగుళాలు, వెడల్పు 58 అంగుళాలు. శీతాకాలంలో ఈ దుప్పటి వెచ్చదనాన్ని అందిస్తుంది. ప్రయాణ సమయంలోనూ ఆ ఉలెన్‌ బ్యాంకెట్‌ను ఉపయోగిస్తే చలి నుంచి రక్షణ వస్తుంది.

గ్లాసిఎల్‌ ఆల్‌ సీజన్‌ పోరల్‌ ప్లీ బ్లాంకెట్‌ : ఇది ఆల్‌ సీజన్‌ పోలార్‌ ప్లీస్‌ బ్లాంకెట్‌. దీనిలోని ఫాబ్రిక్‌ పాలిస్టర్‌ చాలా వెచ్చని అనుభూతిని అందిస్తుంది. దీనిని ఉపయోగిస్తున్నప్పుడు సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది రెండు వైపుల నుంచి అల్లినదిగా ఉంటుంది. ఈ దుప్పటిని మెషిన్‌ వాష్‌ కూడా చేసుకోవచ్చు.

బెడ్‌ మీద వాడే దుప్పట్లు …

ప్యానెల్‌ బ్యాంకెట్‌ : ఇది చూడటానికి చాలా అందమైన పసుపు రంగు దుప్పటి. ఇది 230 సెం.మీ.పొడవు, 200 సె.మీ.వెడల్పుతో చాలా మృదువుగా ఉంటుంది. సౌకర్యవంతమైంది. ఎసిలో కూడా ఉపయోగించొచ్చు. సింగిల్‌; డబుల్‌ బెడ్‌కు సరిపడేవి కూడా అనేక రంగుల్లో అందు బాటులో ఉన్నాయి.

స్టెయిలిష్‌ సింగిల్‌ బెడ్‌ బ్యాంకెట్‌ : ఇది ఒకే మంచానికి తగిన బ్రౌన్‌ కలర్‌ పోలార్‌ ప్లీస్‌ బ్యాంకెట్‌. దీని బరువు 400 గ్రాములు మాత్రమే. ఈ దుప్పటి ప్రయాణించేటప్పుడు తీసుకెళ్లటానికి కూడా అనుకూలంగా ఉంటుంది. వెచ్చదనంతో పాటుగా పూర్తి సౌకర్యాన్ని ఇస్తుంది. అసలు చలిపుట్టదు.

సోలిమో పోలార్‌ ప్లీస్‌ బ్లాంకెట్‌ : ఇది పోలార్‌ మెటీరియల్‌తో తయారుచేసిన నేవీ బ్లూ కలర్‌ సాఫ్ట్‌ బ్లాంకెట్‌. 100 శాతం పాలిస్టర్‌తో తయారుచేశారు. ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. దీని ఫాబ్రిక్‌ డబుల్‌ బ్రష్‌ చేయబడింది. ఇది చల్లని వాతావరణంలో మీకు చాలా వెచ్చదనాన్ని ఇస్తుంది. డబుల్‌ బెడ్‌కు సరిపడేలా నేడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

క్లాత్‌ ప్యూసిన్‌ మింక్‌ ఫ్యాబ్రిక్‌ డబుల్‌ బ్యాంకెట్‌ : ఈ డబుల్‌బెడ్‌ బ్లాంకెట్‌ చాక్లెట్‌ బ్రౌన్‌ కలర్‌లో ఉంటుంది. మొత్తగా ఉండటమే కాకుండా చలిని పోగొట్టి వెచ్చదనాన్ని ఇస్తుంది. ఈ దుప్పటిని పిల్లలు, పెద్దలు అందరూ ఉపయోగించొచ్చు.

వెయిటెడ్‌ కాటన్‌ బ్లాంకెట్‌ : కాటన్‌ మెటీరియల్‌తో తయారుచేశారు. ఈ వైట్‌ కలర్‌ బ్లాంకెట్‌ చూడటానికి చాలా సౌకర్యవంతంగా కనిపిస్తుంది. ఈ దుప్పటి తేలికగా ఉండటమే కాకుండా మంచి వెచ్చదనాన్ని కూడా ఇస్తుంది.

క్లాత్‌ ఫ్యూజిన్‌ గ్లాసికల్‌పోలార్‌ ప్లీస్‌ బ్లాంకెట్‌ : ఇది సింగిల్‌ బెడ్‌కు అనువైన చార్‌కోల్‌ బ్లాక్‌పీస్‌ బ్లాంకెట్‌. పాలిస్టర్‌ మెటీరియల్‌తో తయారు చేశారు. ఇది తేలికగాను వెచ్చగా ఉంటుంది.

ఉలెన్‌ బ్లాంకెట్‌ : చల్లటి వాతావరణంలో పూర్తి వెచ్చదనాన్ని ఇస్తుంది. ఇది ఒక మంచానికి అనుకూలంగా ఉంటుంది. ఉన్ని దుప్పటి కావటంతో ప్రయాణంలో కూడా తీసుకెళ్లొచ్చు.

➡️