ఎవరి టాలెంట్‌ వారిదే!

May 9,2025 02:56 #feachers, #jeevana, #katha

తోటపల్లి ఊరిలో రాజు, రమణ ఆరవ తరగతి చదువుతున్నారు. రాజు బాగా చదివి తరగతిలో ప్రథమ స్థానంలో ఉంటే, రమణ చదువుపై శ్రద్ధ పెట్టక చివరి స్థానంలో ఉండేవాడు. ఏ రోజు ఇచ్చిన పనిని ఆ రోజే పూర్తి చేసే రాజును ఉపాధ్యాయులు అందరూ మెచ్చుకునేవారు. రమణ మాత్రం ప్రతి రోజు ఉపాధ్యాయుల చేత తిట్లు తినేవాడు.
ఒక రోజు తరగతిలో టీచర్‌ పాఠం చెబుతుండగా, రాజు శ్రద్ధగా వింటున్నాడు. రమణ మాత్రం పేపర్‌పై ఏదో వ్రాస్తున్నాడు. రాజు అది చూసి ‘పాఠం విను రమణ’ అన్నాడు. ‘మాస్టారు చెప్పేది నాకేమీ అర్థం కాదులేరా! నువ్వు విను చాలు’ అని రమణ జవాబు ఇచ్చాడు. టీచర్‌ అది గమనించి రమణ దగ్గరికి వచ్చి చూశారు. రమణ ఒక బొమ్మను గీసాడు. అది చాలా బాగుంది.
టీచర్‌ రమణను దగ్గరికి తీసుకుని ‘శభాష్‌ రమణా, అందరిలో ఈ టాలెంట్‌ ఉండదు. నీలో ఉంది కాని అంతకంటే చదువు ముఖ్యం. నువ్వు శ్రద్ధగా చదివితే డ్రాయింగ్‌ క్లాసులో నేను చేర్పిస్తాను’ అని చెప్పారు. టీచర్‌ మాటలు రమణకు నచ్చాయి. రాజు సహాయంతో రమణ అప్పటినుండి శ్రద్ధగా చదవడం మొదలుపెట్టాడు. వేసవి సెలవుల్లో రమణను టీచర్‌ డ్రాయింగ్‌ క్లాసులకు పంపించారు. కొన్ని సంవత్సరాల తర్వాత రాజు స్కూల్‌ టీచరయ్యాడు.

– బి.అఖిల, 7వ తరగతి,
జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, అనంత సాగర్‌, సిద్ధిపేట జిల్లా.

➡️