జీబ్రా క్రాసింగ్‌

Nov 29,2024 03:44 #chinnari, #feachers, #jeevana, #kavithalu

జీబ్రా క్రాసింగ్‌ చారలు
నలుపు తెలుపు గీతలు
రోడ్డు దాటువారికి
పాదచారులకు రక్షణ దారులు

పాఠశాలలు కూడళ్ల చెంత
ఉండు స్పష్టమైన దృశ్యమానత
అక్కడ రోడ్డు దాటుట భద్రత
పాదచారులు చారల గుర్రమెక్కినంత

జీబ్రా ఆల్జీబ్రా కాదు
గుణకార కూడికల లెక్క కాదు
రోడ్డు అటు ఇటు దాటువారు
రోడ్డుకు సమానమే వారందరు

జీబ్రా క్రాసింగ్‌ రంగులు
చీకట్లో వెలుగు ఆధునిక హంగులు
డిజిటల్‌ సిగలింగ్‌ లైటింగ్‌లు
కన్ఫ్యూజన్‌ లేకుండా క్రాసింగ్‌లు

అక్షాంశ రేఖాంశాలైన రహదారులు
అదుపు లేని వేగాల వాహనాలు
అరక్షణమైన ఆగలేని ఆత్రుతలు
అరికట్టలేని రోడ్డు ప్రమాదాలు!

కిక్కిరిసిన నేటి రహదారులు
పాదచారులకు పగలే చుక్కలు
రోడ్డు దాటాలంటే మహాచిక్కులు
ఎక్కలేరు పెద్దవారు పై వంతెనలు

జీబ్రా చారలు ,సిగల్స్‌ లేని చోట
పగలైన రాత్రైనా రోడ్డు దాటుట
ప్రాణాలతో చెలగాటమాడుట
పద్మవ్యూహం నుంచి బయటపడుట!

– పి.బక్కారెడ్డి,
97053 15250.

➡️