May 25,2023 15:15

ప్రజాశక్తి-తాళ్లరేవు : దివంగత ఉపాధ్యాయులు, ఎస్సీ.-ఎస్టీ.ఫెడరేషన్ టీచర్స్ యూనియన్ నాయకులు మాసాబత్తుల సత్యనారాయణ (ఎం.ఎస్.) జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్(ఎండీయూడబ్ల్యూఏ)కు లక్ష రూపాయలు విలువైన ఫ్రీజర్ బహుకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెస్ కుటుంబ సభ్యులు బాబు త్రివేన్, సామంత్, వాడపాటి సురేష్ బాబు, సుధీర్ బాబులను ఎండియూడబ్ల్యూఏ అధ్యక్షులు పెయ్యల రమేష్, రెడ్డి గిరిబాబు, రెడ్డిబాబు తదితరులు దుశ్శాలువ పూలమాలలతో సత్కరించారు. ఈ ఫ్రీజర్ పేద ప్రజలకు ఉపయోగపడితే మా తండ్రి ఆశించిన విధంగా మేలు జరుగుతుందని ఎమ్.ఎస్.తనయుడు త్రివేన్  అన్నారు. ఈ ఫ్రీజర్ను తాళ్లరేవు పంచాయతీ ద్వారా మండలంలోని 17 పంచాయతీల ప్రజలకు ఉచితంగా అందిస్తామని సంఘం అధ్యక్షులు రమేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వజన కళా మండల జిల్లా అధ్యక్షులు వడ్డి ఏడుకొండలు, సంఘం నాయకులు తాడి షణ్ముఖ రాజు, ఎడ్ల కుటుంబరావు, వాకపల్లి చిరంజీవి, జక్కల చిన్నారి, గోపి, జగన్, కావూరి వెంకటేశ్వరరావు, వి.శ్రీనివాస్  పి.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.