Nov 25,2022 16:14

ప్రజాశక్తి - భవానీపురం : ఇటీవల గొల్లపూడిలోని గాంధీ హోల్సేల్ కమర్షియల్ కాంప్లెక్స్ లో ఉన్న ట్రాన్స్పోర్ట్ లో పనిచేస్తున్న ముఠా కార్మికులు ఆవుల వెంకటేశ్వర్లు, నీలకంఠం రోడ్డు ప్రమాదంలో టిప్పర్ ఢీకొనటం సంఘటనలో మృతి చెందారు. ఈ నేపథ్యంలో మెఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్ చేపట్టే పనులు నేపథ్యంలో టిప్పర్ ఢీకొనడంతో ఆ ఇద్దరు కార్మికులు మృతి చెందారు. సంబంధిత కంపెనీ నిర్వాహకులు, పశ్చిమ సిఐటియు కార్యదర్శి బోయి సత్యబాబు ఆధ్వర్యంలో సంబంధిత కుటుంబ ఇద్దరు సభ్యులకు రూ. 3 లక్షలు ఆర్థిక సహాయం భవానిపురంలోని సిపిఎం కార్యాలయంలో శుక్రవారం ఇప్పించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పశ్చిమ సిటీ కార్యదర్శి బోయి సత్యబాబు, ఆటో వర్కర్స్ యూనియన్ పశ్చిమ కార్యదర్శి కరీముల్లా, ముఠా కార్మిక నాయకులు వెంకటేశ్వరరావు( చౌదరి) తదితరులు పాల్గొన్నారు.