Nov 26,2022 15:02

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించి కారు దగ్ధమైన సంఘటన పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. పట్టణంలోని నలంద పాఠశాల వద్ద కెనరా బ్యాంకు ఉద్యోగి ఓబుల్ రెడ్డికి చెందిన కారు షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటల్లో దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు సకాలంలో స్పందించి మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది.