Sep 30,2022 14:49

ప్రజాశక్తి-కలెక్టరేట్ : విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ జాలారిపేటలో అగ్ని ప్రమాదం  జరిగింది. ప్రమాదంలో ఫిషింగ్ హార్బర్ లో ఉన్న షెడ్ లు అన్నీ కాలి బూడిదయ్యాయి. తెల్లవారుజామున సుమారు నాలుగు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. మత్స్యకారులు ఈ షెడ్ లు లోనే, తమ వృత్తికి అవసరమైన వలలు, ఇతర పరికరాలను భద్రపరుస్తారు. అవన్నీ కూడా పూర్తిగా కాలి దగ్ధమయ్యాయి. ప్రమాద కారణాలు తెలియలేదు. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని కొందరు, మత్స్యకారులకు నష్టం కలిగించడం కోసం కావాలని ఎవరో వీటిని దగ్ధం చేశారని మరికొందరు అంటున్నారు. నష్టం లక్షలలోనే ఉంటుందని భావిస్తున్నారు.