
వాషింగ్టన్: అమెరికా వైద్యులు అరుదైన ఘనత సాధించారు. తల్లి గర్భంలోని శిశువు మెదడుకు శస్త్ర చికిత్స చేశారు. ప్రపంచంలోనే ఈ తరహా ఆపరేషన్ ఇదే తొలిసారి కావడం విశేషం. బోస్టన్‌లోనిపిల్లల ఆసుపత్రిలో ఈ ఆపరేషన్ జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు స్ట్రోక్ జరుల్‌లో ప్రచురితమయ్యాయి. సాధారణ వైద్యపరీక్షల్లో భాగంగా తల్లిగర్భంలోని 30 వారాల శిశువు మెదడులో ఉను సమస్యను వైద్యులు గుర్తించారు. మెదడులో అరుదైన రక్తనాళాల సమస్య వారి దఅష్టికి వచ్చింది. ఈ సమస్యతో బాధపడే శిశువు గుండె వైఫల్యం లేక మెదడు దెబ్బతినడం జరుగుతుంది. చాలావరకు ఇలాంటి కేసుల్లో జీవించడం అరుదు. మెదడు నుంచి గుండెకు రక్తానిు సరఫరా చేసే నాళాలు సరిగా అభివృద్ధి చెందకపోతే ఈ పరిస్థితి వస్తుంది. 'ఈ సమస్యతో జన్మించిన వారిలో 50 నుంచి 60 శాతం మంది వెంటనే అనారోగ్యానికి గురవుతారు. బిడ్డపుట్టగానే మెదడు, గుండె వైఫల్యానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అందులో 40 శాతం మంది చనిపోయే అవకాశం ఉంటుంది' అని బోస్టన్ పిల్లల ఆసుపత్రి వైద్యనిపుణులు తెలిపారు. ఆ శిశువును ఎలాగైనా కాపాడాలని నిర్ణయించుకును వైద్య బృందం 34 వారాల ఆ గర్భస్థ శిశువుకుశస్త్రచికిత్స నిర్వహించి, విజయవంతమైంది. కొద్దిరోజులకు బిడ్డ జన్మించిందని, పూర్తిస్థాయి ఆరోగ్యంగా ఉందని వైద్యులు తెలిపారు.