Oct 13,2021 07:26

15 మంది మృతి, ముగ్గురు గల్లంతు
అతలాకుతలమవుతున్న షాంగ్జీ ప్రావిన్స్‌
బీజింగ్‌ :
ఉత్తర చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్‌లో కుంభవృష్టిగా కురిసిన వర్షాలు, వరదల్లో 15మంది చనిపోయారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. లక్షా 20వేలమందికి పైగా నిరాశ్రయులయ్యారని స్థానిక ప్రభుత్వం మంగళవారం తెలిపింది. గత వారం రోజులుగా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు షాంగ్జీ రాష్ట్రంలోని 76కౌంటీ స్థాయి ప్రాంతాల్లో వేలాది మంది నిరాశ్రయు లయ్యారు.. 2,38,460 హెక్టార్లలో పంట దెబ్బతింది. 37,700 ఇళ్లు ధ్వంసమయ్యాయి..