Jul 01,2022 09:54

ప్రజాశక్తి- కలకడ (అన్నమయ్య) : అడ్మిషన్ల కోసం ఉపాధ్యాయులు పల్లెబాట పట్టిన సన్నివేశం మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని బాటవారిపల్లెలో ఉన్న జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల తెలుగులో ఆరవ తరగతిలో విద్యార్థులను చేర్చుకునే దిశగా ఉపాధ్యాయులు పల్లె పల్లె తిరిగి అడ్మిషన్లను చేర్చుకోవడం విశేషం. మండల కేంద్రమైన కలకడ సమీపంలో ఉన్న ఎస్టి కాలనీలో 6వ తరగతిలో విద్యార్థులను స్కూల్‌లో చేర్పించే దిశగా తల్లిదండ్రులతో చర్చించామని ప్రధానోపాధ్యాయురాలు సరస్వతి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో సకల సౌకర్యాలు కలిగి విద్యార్థులకు ఉత్తమ విద్యుత్‌తోపాటు క్రమశిక్షణతో నడుచుకునేందుకు అవకాశాలు ఉన్నాయని ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు తెలిపారు. గురువారం 14మందిని ఆరవ తరగతిలో చేర్చేందుకు తల్లిదండ్రులు ఒప్పుకున్నట్లు గణిత ఉపాధ్యాయులు శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.