Nov 26,2022 15:12

ప్రజాశక్తి-పాలకొల్లు : విద్యార్థిగా ఉండగానే నిర్దిష్ట లక్ష్యంతో చదివితే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని నరసాపురం సబ్ కలెక్టర్ ఎం సూర్య తేజ చెప్పారు.పాలకొల్లు ఛాంబర్ డిగ్రీ,పిజి కళాశాలలో శనివారం జరిగిన ఫ్రెషర్స్ డేలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. లక్ష్యం నెరవేరుటకు మంచి ప్లానింగ్ తో నిరంతర శ్రమ అవసరం అన్నారు.తాను సివిల్స్ లో పడిన శ్రమను విద్యార్థులకు వివరించారు. కళాశాలలో వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్దుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.ఇంకా ఛాంబర్ అధ్యక్షుడు కారుమూరి నరసింహారావు, సెక్రటరీ కలిదిండి రామరాజు, ఛాంబర్ ఎడ్యుకేషనల్ నేతలు తటవర్తి కృష్ణమూర్తి,జె రామలింగేశ్వరరావు, డా ఎబికె మూర్తి,నందుల సీతారామరాజు ప్రిన్సిపాల్ లు డా డి వెంకటేశ్వరరావు, ఓల్గా, దేవరపులక్ష్మినారాయణ పాల్గొన్నారు.