Oct 03,2022 01:19

నిరసన తెలుపుతున్నత కార్మికులు

ఒంగోలు సబర్బన్‌ : మున్సిపాలిటీలలో పనిచేస్తున్న పారిశుధ్య, ఇంజినీరింగ్‌ విభాగాల కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా యూనియన్‌ నాయకులు నగరంలోని బాపూజీ మార్కెట్‌ కాంప్లెక్స్‌ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి ఆదివారం వినతిపత్రం అందజేశారు. అనంతరం కొద్దిసేపు నిరసన తెలిపారు. ఈసందర్భంగా యూనియన్‌ నగర వర్కింగ్‌ సెక్రటరీ శ్రీరామ శ్రీనివాసరావు మాట్లాడుతూ నగరపాలక సంస్థ కార్మికుల సమస్యల పరిష్కారంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు విఫలమయ్యారని చెప్పారు. కనీసం కార్మికులకు పనిముట్లు ఇచ్చే పరిస్థితిలో కూడా అధికారులు లేరని విమర్శించారు. కార్మికులకు పనిభారం పెరిగి అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సుప్రీం కోర్టు తీర్పు అమలు పరచి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు కె. బాలకృష్ణ, ఎద్దు రవి తదితరులు పాల్గొన్నారు.