Oct 03,2022 01:14

నివాళులర్పిస్తున్న కలెక్టర్‌, ఎంపీ, జడ్‌పి చైర్‌పర్సన్‌

ప్రజాశక్తి - ఒంగోలు కలెక్టరేట్‌ : మహాత్మా గాంధీ ఆశయాలు, ఆలోచనలను కొనసాగించాలని కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. జాతిపిత మహాత్మా గాంధీ 153 జయంతి సందర్భంగా స్థానిక గాంధీ సెంటర్‌ లోని మహాత్మా గాంధీ విగ్రహానికి జడ్‌పి చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు పార్లమెంట్‌ సభ్యులు మాగుంట శ్రీనివాసుల రెడ్డితో కలిసి కలెక్టర్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ శాంతి యుతంగా భారతదేశానికి స్వాంతంత్యం తీసుకురావడంలో గాంధీ ముఖ్యపాత్ర పోషించారన్నారు. కుల, మత, ప్రాంతాల భేదం లేకుండా అన్ని వర్గాల వారిని కలుపుకుని పోరాటం చేశారన్నారు. గాంధీ కలలుకన్న గ్రామ స్వరాజ్యాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి గ్రామ, వార్డు సచివాలయాలను స్థాపించి గ్రామ స్థాయిలోనే ప్రజలకు స్వపరిపాలన చేరువ చేశారన్నారు. వీటి ద్వారా సంక్షేమ, అభివద్ధి పథకాలు అందరికీ అందుతున్నాయన్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ అందరూ గాంధీ అడుగుజాల్లో నడవాలన్నారు. గాంధీ అహింసా మార్గాన్ని ఎంచుకుని స్వాతంత్య్రం కోసం అనేక పోరాటాలు చేశారని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్‌పి నా గేశ్వరరావు, ఒంగోలు కార్పొరేషన్‌ కమిషనర్‌ ఎం.వెంకటేశ్వరరావు, డిఎస్‌పి యు. నాగరాజు, అధికారులు పాల్గొన్నారు.