Jan 18,2022 15:32

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : కర్నూలు నగరంలోని పాతబస్తీ నందుగల గడియారం హాస్పిటల్ లో మౌలిక వసతులు కల్పించాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, సిపిఎం నగర కార్యదర్శి ఎం రాజశేఖర్, కార్యదర్శివర్గ సభ్యులు షేక్ ముహమ్మద్ షరీఫ్, డి.అబ్దుల్ దేశాయ్ లు డిమాండ్ చేశారు. మంగళవారం గడియారం ఆస్పటల్ పర్యటన చేశారు. ఈ సందర్భంగా వారు అక్కడ ఉన్న సిబ్బందితో వారు సమస్యలపై ఇష్టాగోష్టి జరిపారు. అక్కడ ఉన్న పేషెంట్లు అటెండర్ లతో విచారించారు. గడియారం హాస్పిటల్ పేరుకు మాత్రమే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నచందంగా మారిందని, వారు ఎద్దేవా చేశారు. కర్నూలు నగరంలోని సగం జనాభాకు పైగా ఇక్కడే జన్మించారు అంటే అతిశయోక్తి కాదని, 100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ చారిత్రాత్మకమైన విశిష్టత కలిగిన ఈ ఆసుపత్రి పాలకుల ఆదికారు ల పుణ్యమా అని, ఈరోజు తల్లిదండ్రులు లేని అనాధగా మారిందని, ఆవేదన వ్యక్తం చేశారు. నగర పాలక సంస్థ అధికారులు, ప్రభుత్వం వీరిద్దరి నిర్లక్ష్యం వల్ల గడియారం హాస్పిటల్ కి ఈ దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఇప్పటికైనా వైసీపి ప్రభుత్వం, నగరపాలక సంస్థ కమిషనర్ చర్యలు తీసుకొని, ఖాళీగా ఉన్న పోస్ట్ లు ఏఎన్ఎం లు 3 పోస్టులను అలాగే ఆయాల మూడు పోస్టులను స్టాఫ్ నర్సుల రెండు పోస్టులను మెడిసిన్ ఇచ్చి మౌలిక వసతులు కల్పించాలని పర్మనెంట్ డాక్టర్ను నియమించాలని అక్కడ  మందులు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజానీకాన్ని సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గౌస్ భాష, ఇస్మాయిల్ , ఖాదర్ , ముస్తఫా, తదితరులు పాల్గొన్నారు.