Mar 28,2023 01:12
ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: నిర్దిష్ట గడువు లోపు స్పందన ద్వారా వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించాలని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం బాపట్ల జిల్లా పోలీస్‌ కార్యాలయంలో జిల్లా ఎస్పీ స్పందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల ప్రజలు జిల్లా పోలీస్‌ కార్యాలయానికి వచ్చి తమ సమస్యలను స్వయంగా జిల్లా ఎస్పీ అర్జీల ద్వారా తెలియజేశారు. ఎస్పీ వారి సమస్యలు విని, ఫిర్యాదులను పరిశీ లించి సంబంధిత పోలీస్‌ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. స్పందన ద్వారా వచ్చిన ఫిర్యాదులపై చట్టపరంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ స్పందన కార్యక్రమంలో డిసిఆర్‌బి డిఎస్‌పి జి లక్ష్మయ్య, స్పందన సెల్‌ ఇన్‌స్పెక్టర్‌ విమాలకొండయ్య, సిబ్బంది పాల్గొన్నారు.