Mar 27,2023 20:28

మాట్లాడుతున్న కమిషనర్‌ హరిత

మాట్లాడుతున్న కమిషనర్‌ హరిత
గడువులోపు 'స్పందన' పరిష్కారం అందించాలి
- కమిషనర్‌ హరిత పిలుపు
నెల్లూరు:రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత ఆశయాలతో నిర్వహిస్తున్న స్పందన వేదికలో అందే ఫిర్యాదుల పరిష్కారంలో నగర పాలక సంస్థ అన్ని విభాగాల సిబ్బంది నిబద్ధత పాటించాలని, నిర్దేశించిన గడువులోపు సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించాలని కమిషనర్‌ హరిత అధికారులకు సూచించారు. కార్పోరేషన్‌ కార్యాలయంలో సోమవారం జరిగిన స్పందన వేదికలో ఫిర్యాదుదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ విభాగం ఉన్నతాధికారి తమకు సంభందించిన ఫైళ్లు పెండింగులో లేకుండా జాగ్రత్తలు వహించాలని, సూచించిన గడువులోపు సమస్యలు పరిష్కారం కావాలని స్పష్టం చేసారు
. డయల్‌ యువర్‌ కమిషనర్‌ ద్వారా 13 సమస్యలు, స్పందన వేదికలో 28 విజ్ఞప్తులను అందుకున్నామని, గడువులోపు పరిష్కరించేందుకు కషి చేస్తామని తెలిపారు.స్పందన వేదికలో ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ వెంకట రమణ, మేనేజర్‌ ఇనాయతుల్లా, ఇంజనీరింగ్‌ విభాగం ఎస్‌.ఈ సంపత్‌ కుమార్‌, టి.పి.ఆర్‌.ఓ ప్రసాద్‌, పట్టణ ప్రణాళికా విభాగం అధికారి దశయ్య, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.