
గిరిజనులతో మాట్లాడుతున్న సబ్ కలెక్టర్ నూర్ ఉల్ కమర్
ప్రజాశక్తి - కురుపాం : మండలంలో గుమ్మ గదబవలస, రస్తా కుంటు బారు గ్రామాల్లో బుధవారం సబ్‌కలెక్టర్ నూర్ ఉల్ కమర్ పర్యటించారు. ఈ సందర్భంగా సవర, గదబ ప్రజల వద్దకు వెళ్లి ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు తప్పని సరిగా ఓటు హక్కు నమోదు చేయించుకోవాలని సూచించారు. అనంతరం స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులకు ఈ నెల 8వ తేది వరకు అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ ఆర్.రమేష్ కుమార్, ఉప తహశీల్దార్ కె.నాగేశ్వరరావు, ఆర్ఐ ప్రసాద్ పాల్గొన్నారు.