మాట్లాడుతున్న ఎంపిపి లక్ష్మీ దేవమ్మ
ప్రజాశక్తి - నందవరం
ఈనెల 1న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉన్నందున అధికారులు మండల సర్వసభ్య సమావేశాన్ని గంటలో ముగించారు. బుధవారం ఉదయం 11.30 మొదలు పెట్టి 12.30 నిమిషాలకు ముగించారు. ఆయా శాఖల అధికారులు పురోగతిని వివరించారు. ఎంపిపి లక్ష్మీ దేవమ్మ, ఎంపిడిఒ కృష్ణమూర్తి, వైసిపి నాయకులు శివారెడ్డి గౌడ్, విరుపాక్షి రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.