Nov 21,2020 16:39

చిత్తూరు: గంటలో పెళ్లి అనగా ఓ వధువు షాకిచ్చింది. తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారంటూ ప్రియుడితో పోలీసులకు ఫిర్యాదు చేయించింది. అనంతరం పెళ్లిచేసుకోనని తానూ మొండికేసింది. ప్రియుడి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగప్రవేశం చేయడంతో పెళ్లి ఆగిపోయింది. వధువును అధికారులు చెన్నై పంపారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పీలేరులో గుర్రం కొండలో చోటుచేసుకుంది.