Oct 02,2022 15:52

ప్రజాశక్తి-కలకడ : మహాత్మా గాంధీ జన్మదిన వేడుకలను మండలంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రమైన కలకడ ఎంపీడీవో కార్యాలయం, తహసిల్దార్ కార్యాలయం నందు ఎంపీపీ శ్రీదేవి రవికుమార్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం దేశ స్వాతంత్రం కోసం అహింస, సత్య అన్వేషణ ఆయుధాలుగా మరుచుకుని స్వాతంత్రం పోరాటంలో పాల్గొని మన దేశానికి స్వాతంత్రం రావడానికి ఎంతో కృషి చేశారని వక్తలు కొనియాడారు. అదేవిధంగా దేశ స్వతంత్ర కోసం పోరాడిన మనదేశ రెండవ ప్రధానమంత్రిగా పనిచేసిన లాల్ బహుదూర్ శాస్త్రి జన్మదిన వేడుకలను సైతం మండలంలో పురుషోత్తం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సిహెచ్ నారాయణ దంపతులు, సిబ్బంది జూనియర్ అసిస్టెంట్ భాష మొహద్దీన్  ,వీఆర్వో రవిచంద్రన్, వీఆర్ఏ రమణ, ఎస్ వి ప్రభావతి , తదితరులు పాల్గొన్నారు .