Oct 02,2022 15:25

ప్రజాశక్తి-నార్పల : మండల కేంద్రమైన నార్పలలో జాతిపిత మహాత్మా గాంధీ 153వ జయంతి సందర్భంగా స్థానిక గాంధీ సర్కిల్ లోని గాంధీ మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి అధికారులు ప్రజా ప్రతినిధులు ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు సత్యనారాయణ రెడ్డి జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ నాగరత్నమ్మ సర్పంచ్ సుప్రియ ఉప సర్పంచ్ శ్రీరాములు ఎంపీడీవో దివాకర్ ఈవోఆర్బి లక్ష్మీనరసింహ పంచాయతీ కార్యదర్శి అస్వస్థ నాయుడు సీనియర్ పాత్రికేయుడు శివ రామాంజనేయులు తదితరులు నివాళి అర్పించారు.