Oct 02,2022 16:02

ప్రజాశక్తి-ప్రకాశం : జాతిపిత మహాత్మా గాంధీ 153 వ జయంతి సందర్భంగా స్థానిక నెల్లూరు రోడ్డులో గల గాంధీజీ విగ్రహానికి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్, మాజీ సింగిల్ విండో అధ్యక్షులు బైరెడ్డి జయరామిరెడ్డి, గాంధీజీ,అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారికి ఎదురిచ్ఛి జాతిపిత మహాత్మా గాంధీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు నడుంబించాలన్నారు. గాంధీజీ కలల కన్నా గ్రామ స్వరాజ్యం కోసం పాలకులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దారపనేని నరసింహులు నాయుడు, రాయవరపు మల్లికార్జున చౌదరి, నాగి వెంకటస్వామి, హరి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.