
గొడుగులు పంపిణీ చేస్తున్న ప్రతినిధులు
అనకాపల్లి : పట్టణంలోని మెయిన్ రోడ్డులో చిరు వ్యాపారాలు నిర్వహిస్తున్న వంద మందికి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం గొడుగులు, ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. కడిమిశెట్టి సతీష్ ఆర్థిక సాయంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు రత్న శ్రీనివాస్, రమణ అప్పారావు, అసిస్టెంట్ గవర్నర్ బుద్ధ రమణాజీ, కోశాధికారి శ్రీనివాస్, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.