Jul 29,2021 09:20

టోక్యో : టోక్యో ఒలంపిక్స్‌లో భారత్‌ గురువారం విజయాలు నమోదు చేస్తోంది. బ్యాడ్మింటన్‌లో మహిళ సింగిల్స్‌ ప్రీ క్వార్టర్స్‌లో డెన్మార్క్‌ క్రీడాకారిణి బ్లిచ్‌ఫెల్డ్‌పై సింధు విజయం సాధించి క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టగా..పురుషుల ఆర్చరీలో భారత క్రీడాకారుడు అతాను దాస్‌ ప్రీ క్వార్డర్స్‌కు చేరుకున్నారు. పురుషుల వ్యక్తిగత విభాగంలో ఎలిమినేషన్‌ రౌండ్‌ పోరులో చైనీస్‌ తైపీకి చెందిన యూ చెంగ్‌ డెంగ్‌పై 6-4 తేడాతో విజయం సాధించారు. మలి రౌండ్‌లో కొరియా ఆర్చర్‌ జిన్‌ హెక్‌పై 6-5 తేడాతో గెలుపొందారు. కాగా, జిన్‌హెక్‌ లండన్‌ ఒలంపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన సంగతి విదితమే.
హాకీలో పురుషుల జట్టు క్వార్టర్స్‌లోకి
ఇటు పురుషుల హాకీ జట్టు కూడా పూల్‌ ఎ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ అర్జెంటీనాపై 3-1తో విజయం సాధించిన క్వార్టర్‌ ఫైనల్‌ బెర్తును ఖరారు చేసుకుంది.
బాక్సింగ్‌లోనూ...
బాక్సింగ్‌లో పురుషుల హెవీ వెయిట్‌ (91 కి.పైబడి)లో సతీష్‌ కమార్‌ జమైకా క్రీడాకారుడు బ్రౌన్‌పై 4-1తో విజయం సాధించి...క్వార్టర్స్‌ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు.